ఆరోగ్యశాఖ-కొత్త వైద్య విద్యా డైరెక్టర్ (DME)గా డాక్టర్ విష్ణువర్ధన్ నియమకం
4 కొత్త ప్రిన్సిపాళ్లు,9 మంది కొత్త సూపరింటెండెంట్లు..
అమరావతి: వైద్య విద్యా డైరెక్టర్(DMEడిఎంఈ) గా కాకినాడలోని రంగరాయ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న డాక్టర్ అత్తలూరి విష్ణువర్ధన్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల అదనపు వైద్య విద్య సంచాలకులుగా(ADMEలు) పదోన్నతి పొందిన 15 మంది ప్రొఫెసర్లను ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లుగా పోస్టింగ్‌లు ఇవ్వడంపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు.
కొత్త ప్రిన్సిపాళ్లు:- కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఫార్మకాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ పి.ఉషాకిరణ్ ఎడిఎంఈగా పదోన్నతితో అదే కాలేజీ ప్రిన్సిపాల్ గా నియమితులు కానున్నారు. విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలలో పేథాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ బసుమిత్ర దాస్(ఎస్సి) పాడేరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గాను, కర్నూలు మెడికల్ కాలేజీలో ఎండోక్రైనాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ పి.శ్రీనివాసులు పిడుగురాళ్ల వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గాను, రంగరాయ మెడికల్ కాలేజీలో బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఎస్.శివానిని ఒంగోలు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో జనరల్ సర్జరీ ప్రొఫెసర్ మరియు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ వి.మన్మధరావును విశాఖ ఇన్స్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)కు డైరెక్టర్ గా ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్త సూపరింటెండెంట్ల వివరాలు:- 1-డాక్టర్ సి.శ్రీనివాసులు, న్యూరాజీ ప్రొఫెసర్, కర్నూలు-పిడుగురాళ్ల…2 డాక్టర్ కెఎవి సూర్యనారాయణ(ఎస్సి) ఎండోక్రైనాలజీ ప్రొఫెసర్, ఎఎంసి, విశాఖపట్నం-రాజమహేంద్రవరం…3 డాక్టర్ జి.విశాల ఎనస్థీషియా ప్రొఫెసర్, కర్నూలు-నంద్యాల…4 డాక్టర్ పివివి సత్యనారాయణ(ఎస్సి),జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్, రాజమండ్రి-ఏలూరు…5 డాక్టర్ జి.సౌమిని గైనకాలజీ ప్రొఫెసర్, విశాఖపట్నం-శ్రీకాకుళం…6 డాక్టర్ పి.శ్రీనివాసులు ఎండోక్రైనాలజీ ప్రొఫెసర్, కర్నూలు-మచిలీపట్నం…7 డాక్టర్ పి.రాజశేఖర్,జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్, కర్నూలు-పాడేరు… 8 డాక్టర్ బి.మనోహర్(ఎస్సీ),పీడియాట్రిక్ ప్రొఫెసర్, తిరుపతి-తిరుపతి (రుయా జనరల్ ఆసుపత్రి)…9 డాక్టర్ వి.రాజ్‌కమల్,జనరల్ సర్జరీ ప్రొఫెసర్, విశాఖపట్నం,కిడ్నీ రీసెర్చ్ సెంటర్-పలాస……
ADMEలుగా పదోన్నతి పొందిన 15 మంది సీనియర్ వైద్యుల్లో నలుగురు పోస్టింగ్‌ల కోసం ఎలాంటి ఐచ్ఛికాలను సూచించనప్పటికీ ఖాళీ స్థానాల్లో వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొమ్మది మందికి వారు కొరుకున్న సంస్థలు/ప్రాంతాల్లో పోస్టింగ్‌లు లభించాయి.

