ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి రూ.9,151కోట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్-2024లో రూ.9,151కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు..బుధవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల రైల్వేల కోసం కేటాయించిన బడ్జెట్ వివరాలను ఆయన వెల్లడించారు.. ఆంధ్రప్రదేశ్‌లో 100 శాతం ట్రాక్స్ ను విద్యుదీకరించామని,,అలాగే రూ.73,743కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.. అమృత్ పథకంలో భాగంగా 73 స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నమని,,ఇప్పటికే 743 ఫ్లై ఓవర్, అండర్ పాస్‌ల నిర్మాణం జరిగిందని తెలిపారు..సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కోసం గతంలో కేటాయించిన భూమికి బ్యాక్ వాటర్ సమస్య ఉందని,, రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించిన తరువాత నిర్మాణం ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు..విజయవాడ ఏరుపాలెం నుంచి అమరావతికి కృష్ణనది మీదుగా రూ.2,047 కోట్లతో 56 కి.మీ. మేర రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు..అమరావతి రైల్వే లైన్ కోసం నీతి అయోగ్ అనుమతి ఇచ్చిందని,, ప్రాజెక్టు పూర్తి కావడానికి కొంత సమయం పడుతుందన్నారు..విజయవాడ నుంచి ముంబైకు వందే భారత్ సాధ్యం కాదని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.