ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు నెల్లూరు నుంచి APTDC బస్సులు
ప్రయాణికులకు ఏదైన వివరాలు కావలంటే సంప్రదించండి అంటూ ఇచ్చిన మొబైల్ నెంబరు 9848007024 ఎవరు లిప్ట్ చేసి జవాబు ఇవ్వరు..టోల్ ప్రీ నెంబరుకు ఫోన్ చేస్తే అక్కడ కూడా జవాబు వుండదు. ? websiteలోకి వెళ్లి ప్రయాగ్ రాజ్ టూరు బుక్ చేసుకుందాము అని చూస్తే,అక్కడ వివరాలు లేవు. ? మరి మీ శాఖ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అందిస్తుంది. ? ముందు మీ శాఖలోని అధికారులకు పట్టిన నిర్లక్ష్యం వదిలించండి. ? మేము వార్తలు ప్రచురించాలి అంటే కనీసం మాకు వచ్చే ప్రశ్నలకు అయిన సమాధానం రావాలి కదా ? ఏ.పి టూరిజం మంత్రి దుర్గష్ దృష్టిలోకి ఈ విషయం పంపించడం జరిగింది మరి స్పందిస్తారా? News19tv.com-+918500591009
నెల్లూరు: నెల్లూరు నుంచి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ(APTDC) ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు జిల్లా టూరిజం అధికారి శ్రీనివాసరావు తెలిపారు..ఈ బస్సులు నెల్లూరు నుంచి బయలుదేరి విజయవాడ, రాజమహేంద్రవరం, అన్నవరం, విశాఖపట్నం, పూరి, కోణార్క్, భువనేశ్వర్, కటక్,చండీపూర్, గయ, బుద్ధగయ, కాశీల మీదుగా కుంభమేళా జరిగే ప్రయోగ్ రాజ్ కు చేరుకుంటాయన్నారు.. తిరుగు ప్రయాణంలో ప్రయోగరాజ్ నుంచి శ్రీకూర్మం, అరసవెల్లి, విశాఖపట్నం, విజయవాడ మీదుగా నెల్లూరుకు వస్తాయన్నారు..కుంభమేళాకు వెళ్లే ఈ ప్రత్యేక బస్సులు ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం 6 గంటలకు నెల్లూరులోని శ్రీరాజరాజేశ్వరి ఆలయం వద్ద నుంచి బయలుదేరి ఫిబ్రవరి 18వ తేదీ తిరిగి నెల్లూరు చేరుకుంటాయన్నారు.. ఇందులో పెద్దలకు రూ.25 వేల రూపాయలు, పిల్లలకు రూ 22,500 రూపాయలు ఛార్జీగా వారు పేర్కొన్నారు.. దర్శనం, అల్పాహారం, భోజనం ఖర్చులు ప్రయాణికులే చెల్లించుకోవాల్సి వుంటుందన్నారు.. ఇతర వివరాలకు డివిజనల్ మేనేజర్ 9848007024ను సంప్రదించాలన్నారు. www.aptdc.in లేదా tourism.ap.gov.in లో బస్ రిజర్వేషన్ చేసుకోవచ్చు నని ఆయన తెలిపారు.