AP&TGMOVIESOTHERS

బాలకృష్ణని పరామర్శించిన చంద్రబాబు

హైదరాబాద్: ‘ఎన్‌బీకే 111’ సినిమా షూటింగ్ లో జులై 21న కాకినాడ పోర్ట్‌ లో సినిమా షూటింగ్ సందర్భంగా బాలకృష్ణ గాయపడిన సంగతి తెలిసిందే. ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలాల్లోకి రక్తం చేరడంతో వాపు ఏర్పడింది.ఇటీవల హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించగా, కొద్ది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

బాలకృష్ణని పరామర్శించిన చంద్రబాబు:- ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను సీఎం చంద్రబాబు ఆదివారం ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. బాలయ్య ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆయన అడిగి తెలుసుకున్నారు. త్వరగా కొలుకొవాలని అకాంక్షించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *