DISTRICTS

దేశభక్తికి ప్రతీకగా ‘ఐ లవ్ నెల్లూరు’ సెల్ఫీ పాయింట్-మంత్రి నారాయణ

100 అడుగుల జాతీయ పతాక స్థూపం..

నెల్లూరు: నగరాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే క్రమంలో మినీ బైపాస్ రోడ్డులో చేపడుతున్న ‘ఐ లవ్ నెల్లూరు’ సెల్ఫీ పాయింట్ నిర్మాణ పనులను మంత్రి నారాయణ సోమవారం పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, నగర అభివృద్ధిలో భాగంగా మినీ బైపాస్ వద్ద ప్రత్యేక ఆకర్షణగా ‘ఐ లవ్ నెల్లూరు’ సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే ప్రాంగణంలో 100 అడుగుల ఎత్తైన జాతీయ పతాక స్థూపాన్ని నిర్మిస్తున్నామన్నారు. పతాకం చుట్టూ అందమైన ఫౌంటెన్‌తో పాటు సివిల్, ఎలక్ట్రికల్ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు.

నెల్లూరు జిల్లా ఏర్పడినప్పటి నుంచి సేవలందించిన ఎమ్మెల్యేలు, ఎంపీల ఛాయాచిత్రాలతో ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయ నాయకులు, నెల్లూరుకు చెందిన ప్రముఖుల చిత్రాలను కూడా ప్రదర్శనకు ఉంచనున్నట్లు చెప్పారు.

ప్రత్యేక ల్యాండ్‌మార్క్‌:- ఇది కేవలం జాతీయ పతాక స్థూపం మాత్రమే కాదని, దేశభక్తి, చరిత్ర, సంస్కృతి, నెల్లూరు వైభవాన్ని ఒకే చోట ప్రతిబింబించే స్ఫూర్తి కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. యువతలో దేశభక్తి, జాతీయ విలువలు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల పట్ల గౌరవాన్ని పెంపొందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని చెప్పారు. నెల్లూరుకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించే ప్రత్యేక ల్యాండ్‌మార్క్‌ గా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *