వర్షాల కారణంగా సైకిళ్ళ పంపిణీ తాత్కాలిక వాయిదా-మంత్రి నారాయణ
శుక్ర, శనివారాల్లో..?
నెల్లూరు: మునిసిపాల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ స్కూల్స్ లో చదువుతున్న 10 వేల మంది పేద విద్యార్థుల కోసం 6 కోట్ల సొంత నిధులతో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తలపెట్టిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమం వర్షాల కారణంగా తాత్కాలికంగా వాయిదా పడింది.ఏర్పాట్లకు వర్షం ఆటంకం కలిగించటంతో వీఆర్సీ మైదానాన్ని మంత్రి నారాయణ అదివారం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం నెల్లూరు నడిబొడ్డున ఉన్న వీఆర్సీని పూర్తిగా మూసేసిందని విమర్శించారు. సోమవారం తొలివిడతగా 7 వేల సైకిళ్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ, మైదానంలో వర్షపు నీరు చేరడం, వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల వల్ల పంపిణీని వాయిదా వేస్తున్నామని, వాతావరణం అనుకూలిస్తే 24 వ తేదీ లేదా 25వ తేదీ శుక్ర, శనివారాల్లో సైకిళ్లు పంపిణీ చేస్తామని తెలిపారు.

