80 వేల సంఘాలకు 8 వేల కోట్లు లోన్ లు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాం-మంత్రి నారాయణ
విజయవాడ లో మెప్మా వన్ డే వర్క్ షాప్…
అమరావతి: 2047 నాటికి ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త వుండాలని సిఎం చంద్రబాబు లక్ష్యం అని,, గతంలో ఇసుక కాంట్రాక్టులు డ్వాక్రా గ్రూపులకు ఇవ్వడం జరిగిదని,,కొన్ని అనివార్య కారణాలవల్ల అది అమలు జరుగలేదని మునిసిపాల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు..శనివారం మంత్రిని, మెప్మా అధికారులు ఏపీ సచివాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు..80 వేల సంఘాలకు 8 వేల కోట్లు లోన్ లు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నామని,, 26 జిల్లాలలో మీటింగ్ లు పెట్టాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నట్ల చెపపారు..2029 నాటికి సాధ్యమైనంత మేరకు మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేస్తామని,, మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.. ప్రభుత్వం నుంచి ఏ పథకం అమలు కావలసి ఉన్నా డేటా పర్ఫెక్ట్ గా వుండాలని,, ఇన్ని సంవత్సరాలు అయినా డ్వాక్రా సంఘాలు, మెప్మా డేటాను పర్‌ఫెక్ట్ గా ఉంచుకున్నారని మంత్రి నారాయణ తెలిపారు..మహిళాకాశం పేరిట మెప్మా వెబ్ సైట్, మెప్మా మొబైల్ యాప్ లతో కలసి 5 వెబ్ సైట్స్ ను మంత్రి ప్రారంభించారు..ఈ కార్యక్రమంలో మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్,కార్మిక శాఖ కమిషనర్ శేషగిరిబాబు తరితరులు పాల్గొన్నారు.