రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం
అమరావతి: రాష్ట్రంలో అకాల వర్షాలు పడుతున్నాయి..రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ వెల్లడించారు. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడనుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.పశ్చిమ రాజస్థాన్ నుంచి తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడ, అంతర్గత కర్ణటాక, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. ఇది ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాలలో ఉన్న అపరిత ఆవర్తనం నుంచి దక్షిణ తీర ప్రాంతం ఒడిశా వరకు ఛత్తీస్‌గఢ్ మీదుగా సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించదని వెల్లడించింది.ఆదివారం నుంచి కోస్తా ఆంధ్ర మధ్య ప్రాంతాలు, యానం, పరిసన ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీన పడిందని,, వీటి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్:– బుధవారం వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మంగళవారం 30-40 కి.మీ, బుధవారం 30-40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్:– ఇక్కడ కూడా సోమవారం నుంచి రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడనున్నాయి. ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. అలాగే ఉరుములు, మెరుపులతో కూడి బలమైన ఈదురు గాలులు వచే ఛాన్స్ ఉంది. మంగళవారం గంటకు 30-40 కి.మీ, బుధవారం గంటకు 30-40 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
రాయలసీమ:– ఈ ప్రాంతంలో కూడా రానున్న మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి నెలకొననుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం,,బుధవారం మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడనున్నాయి. పలు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడనున్నాయి. బుధవారం వరకు గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.