AP&TG

అమ‌రావ‌తిలో రెండో విడ‌త భూసమీకరణ‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు-మంత్రి నారాయ‌ణ‌

అమ‌రావ‌తి: అమ‌రావ‌తిలో మ‌రోసారి భూస‌మీక‌ర‌ణ‌పై ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని మునిసిపాల్ శాఖ మంత్రి నారాయ‌ణ‌ అన్నారు.. ఐదువేల ఎక‌రాల్లో ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు నిర్ణయించార‌ని,,దానికోసం భూమి అవ‌సరం ఉంద‌న్నారు.. మంగళవారం రాజ‌ధానిలోని అనంత‌వ‌రంలో గ్రావెల్ క్వారీల‌ను మంత్రి నారాయ‌ణ ప‌రిశీలించిన అనంతరం మంత్రి నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు..మంగ‌ళ‌గిరి, తాడేప‌ల్లి,గుంటూరు,విజ‌య‌వాడ‌ను క‌లిపి త్వ‌ర‌లో మెగాసిటీ ఏర్పాటుచేయాల‌నే ఆలోచ‌న‌తో సీఎం ఉన్నార‌ని మంత్రి తెలిపారు…అందుకే అంత‌ర్జాతీయ స్థాయి విమ‌నాశ్ర‌యం నిర్మాణం చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు చెప్పారు..అయితే ల్యాండ్ ఎక్విజిష‌న్ ద్వారా భూములు తీసుకుంటే రైతులు న‌ష్ట‌పోతార‌నే విష‌యాన్ని స్థానిక ఎమ్మెల్యేలు త‌న దృష్టికి తీసుకువ‌చ్చిన‌ట్లు మంత్రి చెప్పారు..

ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటే రైతుల‌కు ప్ర‌యోజ‌నం:- ల్యాండ్ ఎక్విజిష‌న్ ద్వారా భూములు తీసుకుంటే కేవ‌లం రిజిస్ట్రేష‌న్ ధ‌ర‌లో రెండున్న‌ర రెట్లు మాత్ర‌మే ఎక్కువ వ‌స్తుంద‌ని…అలా కాకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటే రైతుల‌కు ప్ర‌యోజ‌నం ఉంటుంద‌న్నారు..రైతులు కూడా ల్యాండ్ పూలింగ్ ను కోరుకుంటున్నారన్నారు..భూస‌మీక‌ర‌ణ ద్వారా ఎయిర్ పోర్ట్ కోసం ముప్పై వేల ఎక‌రాలు స‌మీక‌రించాల్సి ఉంటుంద‌న్నారు..వీటిలో రైతుల‌కు రిట‌ర్న‌బుట్ ప్లాట్లు ఇవ్వ‌గా మిగిలిన భూముల్లో రోడ్లు,డ్రెయిన్లు,ఇత‌ర మౌళిక వ‌స‌తుల కోసం మ‌రికొన్ని వేల ఎక‌రాలు అవ‌స‌రం ఉంటుంద‌న్నారు.. ఇవ‌న్నీ పోగా ఇంకా ఐదువేల ఎక‌రాలు మాత్ర‌మే  మిగులుతుంద‌న్నారు…అందుకే ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎక్కువ భూమి తీసుకోవాల్సి ఉంటుంద‌న్నారు..అయిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఎయిర్ పోర్ట్ విష‌యంలో భూస‌మీక‌ర‌ణ లేదా భూసేక‌ర‌ణ అనేది ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని స్ప‌ష్టం చేసారు..

రాజ‌ధానిలో ప‌నులు ప్రారంభం:- ప్ర‌స్తుతం రాజ‌ధానిలో ప‌నులు ప్రారంభం అయ్యాయని,,నిర్మాణానికి సంబంధించి అవసరమైన గ్రావెల్ కోసం గనుల శాఖ 851 ఎకరాలు సీఆర్డీయే కు కేటాయించిందన్నారు.. గతంలో అనంతవరం కొండను సీఆర్డీయే కు కేటాయించారని,, అయితే గత ప్రభుత్వంలో 8 మీటర్ల లోతు వరకూ తవ్వేశారని అన్నారు…డ్రోన్ స‌ర్వే ద్వారా ఎంత లోతు వ‌ర‌కూ తవ్వార‌నే దానిపై స్ప‌ష్ట‌త తీసుకుంటామ‌న్నారు…ఇక్క‌డ ఖాళీగా ఉన్న భూమిని కూడా ఏదొక అవ‌స‌రానికి ఉప‌యోగించాల‌ని చూస్తున్నామ‌న్నారు..ఒక నిర్ధిష్ట కాల‌ప‌రిమితితో పనులు పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామ‌ని,, ఏడాదిలో అధికారుల నివాస భ‌వ‌నాలు పూర్తి చేస్తామ‌న్నారు…అలాగే ఏడాదిన్న‌ర‌లో ట్రంక్ రోడ్లు,రెండున్న‌రేళ్ల‌లో  లేఅవుట్ రోడ్లు,మూడేళ్ల‌లో ఐకానిక్ భ‌వ‌నాలు పూర్తి చేస్తామ‌ని మంత్రి నారాయ‌ణ చెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *