వరద బాధితులకు రూ.2.5 కోట్లు సాయం అందించిన సింధూర,శరణిలు
అమరావతి: విజయవాడ వరద బాధితులకు అదుకునేందుకు తమ వంతు సాయంగా నారాయణ విద్యా సంస్థల నుంచి రూ.2.50 కోట్లను నారాయణ కుమారైలు,అల్లూళ్లు విరాళంగా అందించారు.. నారాయణ సంస్థ తరపున పి.సింధూరు, పునీత్,, పి.శరణి, ప్రేమ్ సాయి సీఎంను కలిసి చెక్కును అందించారు.అనంతరం సింధూర,షరణిలు మాట్లాడుతూ విజయవాడకు వరద విపత్తు వల్ల అపారమైన నష్టం జరిగిందని,వరద బాధితులను అదుకునేందుకు రాష్ట్ర ప్రజలకు ముందుకు రావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు నారాయణ విద్యా సంస్థల నుంచి తమ వంతు చిరుసాయం అందించడం జరిగిందని తెలిపారు.