వెంకటగిరి పోలేరమ్మ జాతరకు ఏర్పాట్లు ను పకడ్బందీగా చేపట్టాలి-కలెక్టర్ వెంకటేశ్వర్
ఈ నెల 11 వతేది నుంచి 26వ తేది వరకు..
తిరుపతి: ఈ నెల 11 వతేది నుంచి 26వ తేది వరకు జరగనున్న వెంకటగిరి పోలేరమ్మ జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంబంధిత శాఖల విభాగాలు సమన్వయంతో ప్రణాళిక బద్దంగా ఏర్పాట్లను చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ అదేశించారు. మంగళవారం జిల్లాఎస్పీ సుబ్బరాయుడు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్ఓ పెంచల్ కిషోర్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంకటగిరి పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని, ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం జరిగేలా చూడాలని తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా సంబంధిత శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జాతర ముగింపు రోజులలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని వారికి ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రముఖుల పర్యటన నేపథ్యంలో దర్శన కోసం వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శన సదుపాయం కల్పించాలని తెలిపారు.