జనసేన పార్టీలో చేరిన ముద్రగడ పద్మనాభం కుమార్తె
అమరావతి: జనసేన పార్టీలో వైసీపీ నుంచి నాయకులు చేరారు. శనివారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పలువురు నాయకులు ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు.రాజమండ్రికి చెందిన శ్రీమతి క్రాంతి దంపతులు, అమలాపురంకి చెందిన కల్వకొలను తాతాజీ, గుంటూరుకు చెందిన చందు సాంబశివరావు పార్టీలో చేరారు. వీరికి పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీమతి క్రాంతి… వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె. గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు 5 మంది,,. జగ్గయ్యపేట మున్సిపాలిటి కౌన్సిలర్లు 11 మంది,, 5 మంది కోఆప్షన్ మెంబర్లు,, పార్టీలో జాయిన్ అయ్యారు.. పెడన నియోజకవర్గం నుంచి ఎంపీటీసీతోపాటు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు, నాయకులు పార్టీలో చేరారు.