AP&TGOTHERSSPORTS

క్రీడారంగానికి పూర్వ వైభ‌వం తీసుకొస్తాం-శాప్ ఛైర్మ‌న్

నెల్లూరు: రాష్ట్ర ప్ర‌భుత్వం క్రీడారంగంపై ప్ర‌త్యేక దృష్టి సారించింద‌ని, గ‌త ప్ర‌భుత్వంలో నిర్వీర్య‌మైన క్రీడారంగానికి సీఎం చంద్ర‌బాబు నాయుడు సార‌ధ్యంలో పూర్వ వైభ‌వాన్ని తీసుకొస్తామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్‌) ఛైర్మ‌న్ ర‌వినాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని మొఘ‌ళ్ల‌పాలెంలో జ‌రుగుతున్న మ‌ల్టీప‌ర్ప‌స్ ఇండోర్ స్టేడియం నెల్లూరు ప‌ట్ట‌ణంలోని ఏసీ సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియంను శ‌నివారం ఆయ‌న ప‌రిశీలించారు. తొలుత మ‌ల్టీప‌ర్ప‌స్ ఇండోర్ స్టేడియంలో జ‌రిగిన ప‌నులను ప‌రిశీలించి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అధికారుల‌తో ఆయ‌న స‌మీక్షించారు. పెండింగ్‌లో ఉన్న ప‌నులను త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేయాల‌ని, మ‌రో 15రోజుల్లో ఇండోర్ స్టేడియంను వినియోగంలోకి తీసుకురావాల‌ని ఆదేశించారు. అలాగే సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియంను ప‌రిశీలించి నిర్వ‌హ‌ణ‌కు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తులు, సౌక‌ర్యాల క‌ల్ప‌న‌పై స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని క్రీడాంధ్ర‌ప్ర‌దేశ్‌గా తీర్చిదిద్ద‌డ‌మే ప్ర‌భుత్వ‌ ల‌క్ష్య‌మ‌ని, దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప‌ర్య‌టించి కేవీకేలు, ఇండోర్ స్టేడియంలు, అవుట్‌డోర్ స్టేడియంలు, డీఎస్ఏల ప‌నితీరు, క్రీడారంగంలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *