ఉత్యాహంగా జాతీయ క్రీడాదినోత్సవం క్రీడా పోటీలు
నెల్లూరు: జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలలో భాగంగా మంగళవారం నగరంలోని ఏ.సి.సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అథ్లెటిక్స్, బాడ్మింటన్ పోటీలు నిర్వహించడం జరిగినదని సెట్నెల CEO వై.వెంకటయ్య ఒక ప్రకటనలో తెలిపారు.ఈకార్యక్రమంలో DSDO ఆర్.కె.యతిరాజ్, క్రీడాకారులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు,వాకర్స్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ శిక్షకులు,సిబ్బంది పాల్గొన్నారన్నారు.బుధవారం అవుట్ డోర్ గేమ్స్ :- వాలీబాల్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, ఖో. ఖో,,,,ఇండోర్ గేమ్స్:- బాడ్మింటన్, చెస్, యోగా,,,,ఫన్ గేమ్స:- లెమన్ రేస్, రోప్ జంప్, లగోరి & లంగాడి, సాక్ రేస్ క్రీడాంశములో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.