G.0-29 వ్యతిరేకంగా హైదరాబాద్‌లో అభ్యర్థులు నిరసనలు
బండి సంజయ్ అరెస్ట్..
హైదరాబాద్: G.0-29 వ్యతిరేకంగా హైదరాబాద్‌లో GROUP-1 పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్థులు నిరసనలకు దిగారు.. రిజర్వేషన్లపై తీవ్ర పభావం చూపే ఈ G.0ను రద్దు చేయడం సహా మెయిన్స్ పరీక్షల్ని రీషెడ్యూల్ చేయాలంటూ శనివారం ఆందోళన చేపట్టారు.. GROUP-1 అభ్యర్థులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మద్దతు తెలిపారు.. ప్రభుత్వం దిగి రావాలంటూ ‘చలో సచివాలయం’ కార్యక్రమానికి చేపట్టగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది..
GROUP-1 పరీక్షలను వాయిదా వేయడం సహా G.0-29 రద్దు చేసి న్యాయం చేయాలంటూ గత కొన్ని రోజులుగా అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీశాయి.. హైదరాబాద్ అశోక్‌నగర్‌లో నిరసన తెలుపుతున్నవారికి బండి సంజయ్ మద్దతు తెలపడంతో, GROUP-1 అభ్యర్థులు చలో సచివాలయానికి పిలుపునిచ్చారు.. నిరుద్యోగులకు మద్దతుగా బండి సంజయ్ సైతం ర్యాలీలో పాల్గొన్నారు.. అభ్యర్థులతో కలిసి ర్యాలీగా సచివాలయం వైపు బయలుదేరగా ముందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు..కేంద్రమంత్రి బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో ఉద్రిక్తత తలెత్తింది.. పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.. సీఎంను కలిసి వాస్తవాలు వివరించేందుకే వెళ్తున్నామన్నారు..ఈ G.0తో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు.. ప్రభుత్వం మొండి పట్టుదలకు వెళ్లొద్దని బండి సంజయ్ హితవు పలికారు..గ్రూప్-1 అభ్యర్థులు, బీజేపీ శ్రేణులతో కలిసి ట్యాంక్‌బండ్ దగ్గరలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బండి సంజయ్ నిరసనకు దిగారు.. ఈ క్రమంలో సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆయన్ని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద వదిలిపెట్టారు.