ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అనారోగ్యం
అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు.. ఆయన వైరల్ ఫీవర్‌తోపాటు స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రివారి కార్యాలయం తెలిపింది.. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు..ఈ నేపథ్యంలో గురువారం జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోచ్చని భావిస్తున్నారు.. పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న జనసైనికులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తు,,తమ నాయకుడు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు.