యుద్దాలు జరుగుతున్న రూ.2700 సబ్సిడీతో రైతులకు యూరియా-కేంద్ర మంత్రి
ఆధునిక దేవాలయాలుగా సాగునీటి ప్రాజెక్టులు..చంద్రబాబు
కరవుతో కాదు.. అభివృద్ధితోనే రాయలసీమకు కొత్త గుర్తింపు..పవన్ కళ్లాణ్
అమరావతి: స్వదేశీ-స్వరాజ్యం అన్న గాంధీజి, జై జవాన్- జైకిసాన్ అన్న లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని రాయలసీమలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం అవుతోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అనంత్ అంబానీ, నారా లోకేష్, బీజీపీ రాష్ట్ర అధ్యక్షడు మాధవ్ లతో కలసి అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో రాయలసీమ గ్లోబల్ హార్టీ కల్చర్ హబ్ అంకురార్పణ, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తూ, రైతుల గురించి ఆ మహనీయులు ఆలోచన చేశారు. అటల్ బిహారీ వాజ్ పేయి లాంటి నేతలు బాటలు వేశారు. అదే కోవలో ప్రధాని మోదీ కూడా కిసాన్ సమ్మాన్ నిధి, ఎరువుల కొరత లేకుండా చూస్తున్నారు. యుద్ధ సంక్షోభం ఉన్నా ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం అన్నారు.యూరియా బస్తా ధర అంతర్జాతీయంగా రూ.3వేలు ఖర్చు అవుతోంది. ప్రతీ బస్తాకూ కేంద్రం రూ.2700 సబ్సీడీని భరిస్తూ,కేవలం రూ.3 వందలకే రైతులకు అందిస్తున్నాం అని వెల్లడించారు.
సీ.ఎం చంద్రబాబు:- దేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం పడే 2వ జిల్లా అనంతపురం. ఒప్పుడు ఎడారి ఛాయలు కనబడ్డాయి…వలసలు ఎక్కువ ఉండేవి. పశువులకు మేత ఉండదు… కూలీలకు ఉపాధి లేదు. ఆ పరిస్థితులను అధిగమించేందుకు నా రాజకీయ జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేశాను అని సీ.ఎం చంద్రబాబు తెలిపారు. సీమలో అనేక దేవాలయాలు ఉన్నాయి…కానీ ఆధునిక దేవాలయాలుగా సాగునీటి ప్రాజెక్టులను భావించి పూర్తి చేస్తున్నాం. రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తిచేసి జాతికి అంకితం చేస్తాం అని వెల్లడించారు.
పవన్ కళ్యాణ్:- కరవుతో కాదు.. అభివృద్ధితోనే రాయలసీమకు కొత్త గుర్తింపు
కరవుతో పోరాడిన రాయలసీమను ఇకపై కరువు సీమగా కాకుండా, ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో సమగ్ర ప్రణాళికను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర, అదనపు విలువ లభించేలా ఆధునిక కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పంట ఉత్పత్తి నుంచి నిల్వ, ప్రాసెసింగ్, రవాణా, మార్కెటింగ్ వరకు సమగ్ర వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చి రాయలసీమ రైతుల ఉత్పత్తులను దేశీయ మార్కెట్‌తోపాటు ప్రపంచ మార్కెట్‌కు చేరేలా చర్యలు చేపడుతున్నామని ఆయన వివరించారు.

