AP&TGCRIME

కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో విషాదం-ఏడుగురు మృతి

అమరావతి: శ్రీకాకుళం కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది.. ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది..ఈ తొక్కిసలాటలో 7 మంది దుర్మరణం పాలయ్యారు.. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు..

హరి ముకుందాపాండా:- ఒరిస్సా రాజకుటుంబానికి చెందిన హరి ముకుందాపాండా(95) తిరుమల శ్రీవారి దర్శనంకు వెళ్లిన సమయంలో స్వామిని దర్శనం చేసుకునే సమయంలో సిబ్బంది,,అయనను ముందుకు నెట్టి వేశారు..దింతో బాధపడిన పాండా తన లాంటి వారు స్వామిని మనసారా దర్శనం చేసుకునేందుకు తిరుమల ఆలయం పొలిన వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించాలని భావించారు..ఇందులో బాగంగా తన కొబ్బరి తొటలొని 12 ఎకరాల భూమిలో విశాలంగా శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం కాశీబుగ్గలో నిర్మించారు.

భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో,,వీరి తాకిడికి రెయిలింగ్‌ ఊడిపోయి పలువురు కిందపడటంతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *