20,000 నుంచి 30,000 మంది ఉద్యోగులను తొలగించిన టెక్ జెయింట్ ఒరాకిల్
అమరావతి: టెక్ జెయింట్ ఒరాకిల్,గతంలో ఎన్నడు లేని విధంగా పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలకు చర్యలు చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో సుమారు 20,000 నుండి 30,000 మంది ఉద్యోగులను తొలగించింది. సోమవారం తెల్లవారుజామున పంపిన ఈమెయిళ్ల ద్వారా తెలియజేసిన ఈ తొలగింపుల వల్ల యునైటెడ్ స్టేట్స్, భారతదేశం, కెనడా-లాటిన్ అమెరికాలోని కొన్ని ప్రాంతాల సిబ్బంది ప్రభావితమయ్యారు.అమెరికా, ఇండియా, కెనడా, లాటిన్ దేశాల్లో ఉన్న ఒరాకిల్ కంపెనీ ఉద్యోగులపై భారీ వేటు పడనున్నది. ఒరాకిల్ కంపెనీలో పనిచేస్తున్న సీనియర్లను కూడా తొలగిస్తున్నారు.
వర్కింగ్ టీమ్స్ ను పునర్ నిర్మాణం:- ప్రస్తుత దశలో చాలా వరకు కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై భారీగా పెట్టుబడి పెడుతున్నాయి. వర్క్ ను ఆటోమెట్ చేయడంలో కంపెనీలు నిమగ్నమయ్యాయి. వర్కింగ్ టీమ్స్ ను పునర్ నిర్మిస్తున్నారు. లాభాలపై దృష్టి పెట్టిన కంపెనీలు, భారీ వేతనలు చెల్లించే ఉద్యోగులను తొలగించి, వీరి స్థానంలో ఏఐతో పాటు యువ ఉద్యోగులను నియమించేందుకు ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది.
డైరెక్టర్ స్థాయి ఉద్యోగాలకు:- ఇప్పటి వరకు సురక్షితమని భావించిన మేనేజర్, డైరెక్టర్ స్థాయి ఉద్యోగాలకు ప్రస్తుతం గ్యారెంటీ లేకుండా ఉన్నాయి. ప్రస్తుత దశలో ఒక్క కాలేజీ కూడా 100 శాతం ప్లేస్‌మెంట్ గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఫ్రెషర్స్ అనుభవం కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నరు. కాస్ట్ కట్టింగ్ దశ నుంచి ఇప్పుడు ఏఐ ఫస్ట్ ఫ్యూచర్ అన్న రీతిలో కంపెనీలు ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
వర్క్ ఫోర్స్ ను రీడీజైన్:- ఒరాకిల్ కంపెనీ ఎక్కువగా క్లౌడ్, ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై పెట్టుబడి పెడుతోంది. వర్క్ ఫోర్స్ ను రీడీజైన్ చేస్తున్నది. దీనిలో భాగంగానే సుదీర్ఘకాలం పనిచేసిన ఉద్యోగులను తొలగిస్తున్నారు. టెక్నాలజీకి పెద్దపీట వేయడంతో.. ఆటోమేషన్ పెరిగిపోయిందని, లాభాలపై దృష్టిపెట్టడం వల్లే లేఆఫ్స్ కూడా అధికంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

