AP&TG

శుక్రవారం మేఘావృతమైన వాతావరణంతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

అమరావతి: వాయువ్య బంగాళాఖాతంలోని స్పష్టమైన అల్పపీడనం ఏర్పాడడం, దీనితో పాటుగా ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రేపు శుక్రవారం మేఘావృతమైన వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి -మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులకు అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం వుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉరుములు, ఈదురుగాలులు వచ్చేటప్పుడు చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడ వద్దని అలాగే తెగిపడిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని సూచించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *