EDU&JOBSNATIONALOTHERS

నీట్ రీఎగ్జామ్ భ‌ద్ర‌తా ఏర్పాట్లపై అన్నామలై

అమరావతి: జూన్ 21వ తేదీన నీట్ రీఎగ్జామ్ జ‌ర‌గ‌నున్న నేపధ్యంలో ప్ర‌భుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. “వీ ద లీడ‌ర్స్” సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ బీజేపీ నేత అన్నామ‌లై స్పందిస్తూ, రీ-ఎగ్జామ్ కోసం అసాధార‌ణ రీతిలో భ‌ద్ర‌తా చ‌ర్య‌ల వ‌ల్ల విద్యార్థులు మాన‌సిక వ‌త్తిడికి లోన‌య్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆరోపించారు. ప‌రీక్ష విధానంపై విద్యార్థుల్లో విశ్వాసాన్ని నింపాలే కానీ, ప్ర‌భుత్వం భ‌ద్ర‌త పేరుతో ఇబ్బ‌బంది పెడుతున్న‌ట్లు సోష‌ల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.నాలుగు లేయ‌ర్ల ఏఐ ఆధారిత సీసీటీవీ కెమెరాలోతో నిఘా, బ‌యోమెట్రిక్‌, ఫేషియ‌ల్ రిక‌గ్నిష‌న్ చెక్స్, ఫ్రిస్కింగ్‌, పీఎంవో నుంచి మానిట‌రింగ్ చేస్తున్నార‌ని, దీని వ‌ల్ల విద్యార్థుల‌పై వ‌త్తిడి పెర‌గ‌నున్న‌ట్లు అన్నామ‌లై తెలిపారు. పేప‌ర్ లీక్‌లు నిలువ‌రించేందుకు ప్ర‌భుత్వం ఈ చ‌ర్య‌లు చేప‌డుతున్నా,ప‌రీక్ష సెంట‌ర్ల వ‌ద్ద భ‌ద్ర‌త‌ను పెంచ‌డం, ప‌రీక్షా స‌మ‌యాన్ని అద‌నంగా 15 నిమిషాలు పెండ‌చం వ‌ల్ల విద్యార్థులు ఆందోళ‌న‌కు గురి కానున్న‌ట్లు అన్నామ‌లై తెలిపారు. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ అంశంలోనూ స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, దీని వ‌ల్ల నీట్ విద్యార్థుల వెత‌లు మ‌రింత పెర‌గ‌నున్న‌ట్లు చెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *