NATIONALOTHERSWORLD

ఇరాన్ తో ఒప్పందమా?యుద్దమా? సిద్దం అవుతున్న అమెరికా

అమరావతి: అమెరికా, ఇరాన్‌ తో చర్చలు జరుగుతున్నట్లు ప్రకటిస్తునే, మరో వైపు ఇరాన్‌ పై దాడికి దిగేందుకు అమెరికా సిద్ధం అవుతున్నది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే పశ్చిమ ప్రాంతం వైపున ఉన్న గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ఇరాన్‌ పౌర విమానయాన సంస్థ, సిబ్బందికి నోటమ్‌ జారీచేసింది. ఈనెల 25 వరకు అన్ని విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అమెరికా-ఇరాన్‌ మధ్య చర్చలు తుదిదశకు చేరుకున్నాయని, ఒప్పందానికి సంబంధించిన చాలా అంశాల్లో ఇరుదేశాల మధ్య సయోధ్య కుదిరినట్లు తెలుస్తోంది. దీంతో ఏ క్షణమైనా ఒప్పంద ప్రకటన వెలువడే అవకాశముంది. ఇదే సమయంలో  దౌత్య ప్రయత్నాలు చివరి నిమిషంలో విఫలమైతే, ఇరాన్ పై మళ్లీ దాడులు చేసే విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఏ నిమిషానికి ఎం జరుగుతుందొ వేచిచూడాలి.?

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *