ఈ నెల 19న ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన-కలెక్టర్
నెల్లూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 19వ తేదీన ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 19వ తేదీ ఉదయం 9.00 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి, ఉదయం 10.00 గంటలకు కావలి మండలం తుమ్మలపెంట గ్రామ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10.15 గంటలకు తుమ్మలపెంట గ్రామంలోని ప్రజా వేదిక సమావేశ ప్రాంగణానికి చేరుకుని, మధ్యాహ్నం 12.10 గంటల వరకు నిర్వహించే “మత్స్యకారుల సేవలో” కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.45 గంటలకు తుమ్మలపెంటలో ఏర్పాటు చేసిన ఇంటరాక్షన్ వేదిక వద్ద మత్స్యకారులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పార్టీ కేడర్ సమావేశ వేదికకు చేరుకుని, మధ్యాహ్నం 3.00 గంటల వరకు పార్టీ కేడర్ సమావేశంలో పాల్గొంటారు. 3.15 గంటలకు తుమ్మలపెంట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి, చిత్తూరు జిల్లాకు వెళ్తారని కలెక్టర్ తెలిపారు.

