AP&TGMOVIESOTHERS

రాముణ్ణి,కృష్ణుణ్ణి,ఆదిశంకరుల్ని,వివేకానందుణ్ణి చూడలేదు-తనికెళ్ల భరణి

హైదరాబాద్: తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని విలక్షణ నటుడు,మంచి రచయిత, దర్శకుడు తనికెళ్ళ భరణికి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ  అంటే అపరిమితమైన అభిమానం. ఆయన సారధ్యంలో భారతదేశం అభివృద్ధిపథంలో పురోగమిస్తుందని, తనికెళ్ళ భరణి నమ్మూతారు. అందుకే ఆయన ఏ వేదికపైన ప్రసంగిసంచాల్సి వస్తే, ప్రధాని మోదీ గురించి మంచి మాటలు చెప్పి, ఆయనకు బాసటగా ప్రజలు నిలవాలని కోరుతుంటారు. ఎన్నికల్లో మోదీకి విజయాన్ని అందించాలని, ఆయనకు దేశం పట్ల ఎంతో చిత్తశుద్ధి ఉందని చెప్పేవారు. ప్రధాని మోదీ భక్తుడు అయిన భరణికి,మొదటి నరేంద్రమోదీని ఆదివారం రాత్రి బేగంపేట విమానాశ్రయంలో కలిసే అవకాశం వచ్చింది. ఈ సందర్భంను పురస్కరించుకుని అయన తన మనస్సులో మెదిలిన భావాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో పాటు బహిరంగ సభలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన మోదీ రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. ఆ సమయంలో ఆయనను భరణి కలుసుకున్నారు.ఈ సందర్భాన్ని భరణి ఇలా వ్యక్త పరిచారు.”నేను రాముణ్ణి చూడలేదు,,కృష్ణుణ్ణి చూడలేదు,,ఆదిశంకరుల్ని చూడలేదు,, వివేకానందుణ్ణి చూడలేదు,, అంటే చూడలేము కూడా…అయితే వాళ్లందరి అంశలతో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ గారిని చూశాను,, ముట్టుకున్నాను,, చేతిని ముద్దెట్టుకున్నాను…నా జన్మ ధన్యం” అని పేర్కొంటూ ప్రధాని మోదీతో కరచాలనం చేస్తున్న ఫోటోను పోస్ట్ చేశారు. ఇందుకు ప్రతిగా సోషల్ మీడియా వేదికగా పలువురు భరణిని అభినందిస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *