10వ తరగతి పరీక్షల్లో 85.25 శాతం మంది విద్యార్దులు ఉత్తీర్ణత
16పాఠశాలల్లో 0 శాతం ఉత్తీర్ణత..
అమరావతి: రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను గురువారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 12,089 పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 2,161 పాఠశాలలు 100శాతం ఉత్తీర్ణత సాధించాయి. 16పాఠశాలల్లో 0 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు 6,18,131 మంది విద్యార్హులు హాజరు కాగా 85.25 శాతం మంది విద్యార్దులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు (2,59,633 మంది విద్యార్థులు) 82.68 శాతం,,బాలికలు (2,67,321 మంది విద్యార్థినులు) 87.90 శాతంగా వుంది. బాలుర కంటే బాలికలు 5.22 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు. పార్వతీపురం మన్యం జిల్లా 96.07శాతం ఉత్తీర్ణతతో తొలిస్థానంలో నిలవగా అల్లూరి సీతారామరాజు జిల్లా 57.12శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది.

అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు తేదిలు:- టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను మే 25వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. పరీక్ష ఫీజును మే 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు చెల్లించవచ్చునని తెలిపింది. రూ.50 లేట్ ఫీజుతో మే25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని వెల్లడించింది.రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీ కౌంటింగ్ (సబ్జెక్టు కు రూ.500), రీ వెరిఫికేషన్ (సబ్జెక్టుకు రూ.వెయ్యి) కోసం వెచ్చించాల్సి ఉంటుందని పేర్కొంది. ఫలితాలు:https://apopenschool.ap.gov.in ద్వారా లేక మన మిత్ర వాట్సాప్ నెం.9552300009 ద్వారా తెలుసుకోవచ్చు. మీ మొబైల్‌లో 95523 00009 నంబర్ సేవ్ చేయండి. వాట్సాప్‌లో “Hi” అని మెసేజ్ పంపండి. ఆ తరువాత ‘Education Services’ ఎంపికను ఎంచుకోండి. ‘Download SSC Results’ పై క్లిక్ చేయండి. హాల్ టికెట్ నంబర్ నమోదు చేయండి. ఆ వెంటనే మీ మార్కుల మెమో డిస్‌ప్లే అవుతుంది.

