AP&TGOTHERSSPORTS

శాప్ లీగ్స్–2026- వాటర్ స్పోర్ట్స్ 11, 12 తేదీల్లో- కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

పోస్టర్లను ఆవిష్కరణ..

అమరావతి: శాప్ లీగ్స్ – 2026 కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11, 12 తేదీలలో విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద వాటర్ స్పోర్ట్స్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ఈ క్రీడలకు సంబంధించిన పోస్టర్లను ఆయన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులతో కలిసి మంగళవారం కలెక్టరేట్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. శాప్ లీగ్స్ లో భాగంగా వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె. కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈ వాటర్ స్పోర్ట్స్ పోటీలు రాష్ట్ర స్థాయి ఈవెంట్‌గా సబ్ జూనియర్, జూనియర్ విభాగాల్లో బాలురు, బాలికల కేటగిరీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *