DISTRICTSNATIONAL

ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ ప్రోగ్రాం-ప్రతి నెల రూ.9 వేలు స్రై ఫండ్

ఏప్రిల్ 15వ తేదీ లోపు దరఖాస్తు..

తిరుపతి: యువతకు కేవలం చదువే కాకుండా పని అనుభవం కల్పించాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి ఇంటర్న్ షిప్ ఫేజ్-3 పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని తిరుపతి జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఆర్ లోకనాదం ఒక ప్రకటనలో తెలిపారు. యువతకు కార్పొ రేట్ స్థాయిలో అనుభవం, నైపుణ్యాలు పెంపొందించేందుకు పీఎం ఇంటర్న్షిప్ పథకం దోహదపడుతుందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.9 వేల పారితోషికంతో పాటు వన్ టైం గ్రాంట్ కింద రూ.6 వేలు, పూర్తయ్యాక సర్టిఫికేట్ ఇస్తారన్నారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లాలో 716 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఏప్రిల్ 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకొని ప్రయోజనం పొందాలని కోరారు.

దరఖాస్తు విధానం:- పీఎంఇంటర్న్ షిప్, ఎంసీఏ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్ అనుసం ధానమైన సెల్ ఫోన్ నంబరు, విద్యార్హత, బ్యాంకు ఖాతా వివరాలు పొందుపర్చాలి.

దేశ వ్యాప్తంగా ఉన్న కార్పొ రేట్, ప్రైవేటు కంపెనీలు అవకాశాలు కల్పిస్తాయి. నచ్చిన కంపెనీతో పాటు 6 నెలలు లేదా 9 నెలల కాల వ్యవధిని ఎంచుకో వాలి. ఒక అభ్యర్థి గరిష్ఠంగా 3 కంపెనీలకు ఎంచుకోవచ్చు.

ఎవరు అర్హులు:- వయస్సు 18-25 సంవత్సరాలు ఉండాలి.10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ విద్యార్హత ఉండాలి. కుటుంబ ఆదాయం రూ.12 లక్షల లోపు ఉండాలి.

వీరు అనర్హులు:- ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు. ఐఐటీ, ఐఐఎం, ఎన్ ఎలూ, ఐఐఎస్ఈఆర్, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎస్ సీ వంటి సంస్థల పట్టభద్రులు, సీఏ, ఎంబీ బీఎస్, పీహెచ్ఎ, ఎంఫిల్, ఎంబీఏ చేసిన వారు, స్కిల్, ఇంటర్న్షిప్, అప్రెంటిస్ పథకాల్లో పాల్గొంటున్న వారు అనర్హులు.

ప్రయోజనాలు:- ఇంటర్న్ షిప్ కాలంలో నెలకు స్టెపెండ్ రూ.9 వేలతో పాటు వన్ టైం గ్రాంట్ కింద రూ.6 వేలు నేరుగా బ్యాంకు ఖాతాకు జమచేస్తారు. ఇంటర్న్ షిప్ కాలంలో పీఎంజే జేబీవై, పీఎం ఎస్బీవై బీమా వర్తిస్తుంది.

ఇంటర్న్ షిప్ పూర్తయ్యాక ధ్రువీకరణ పత్రంతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ ఇస్తారు. ఉద్యోగాల కల్పనలో ఇంటర్న్షిప్ చేసిన అభ్యర్థులకు కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి.

Note:1: పీఎం ఇంటర్న్షిప్ స్కీంకు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు క్యాండిడేట్ ప్రొఫైల్లో తిరుపతి జిల్లాను కచ్చితంగా ఎంపిక చేసుకోండి.

గమనిక:2:  పీఎం ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం లో పోర్టల్లో వచ్చే సాంకేతిక సమస్యల కోసం ఈ క్రింది నెంబర్ కు సంప్రదించగలరు,APSSDC,Cell:9966601867.

మరిన్ని వివరాల కొరకు ,9988853335, 9160912690, నంబర్లను సంప్రదించగలరు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *