DISTRICTSEDU&JOBSOTHERS

స్వచ్చహరిత విద్యాలయాలుగా 8 పాఠశాలలు-కలెక్టర్

సర్టిఫికేట్ల బహుకరణ..

నెల్లూరు: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చహరిత విద్యాలయం లో భాగంగా జిల్లాలోని అన్నీ పాఠశాలలను సమగ్రంగా పరిశీలనచేయడం జరిగింది. అందులో బాగంగా నీటి వసతి, మరుగుదొడ్ల పరిశుభ్రత, హ్యాండ్ వాషింగ్, పాఠశాలలో పచ్చదనం,చెట్ల పెంపకం ఇలాంటి మొత్తం సూచికలను సమగ్రంగా సర్వే చేసి జిల్లాలో మొత్తం ఎనిమిది ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేయడం జరిగింది. అందులో బాగంగా సోమవారం కలెక్టర్ హిమాన్షు శుక్లా  చేతుల మీదుగా ఎనిమిది ఉత్తమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కలెక్టర్ వారి చాంబర్లో సర్టిఫికేట్లు ప్రదానం చేయడం జరిగింది. స్వచ్చ విద్యాలయాలలో ఉత్తమమైనవిగా ఎన్నికైన పాఠశాలలు వివరాలు::-

1) ఎం పి పి ఎస్ ముంగళదొరువు, టి పి గూడూరు

2) ఎం పి పి ఎస్ పి వి కండ్రిగ, ఇందుకూరు పేట మండలం

3) ఎం పి పి ఎస్ పలుకూరు, కందుకూరు.

4) మోడల్ స్కూల్ కలిగిరి,

5) రెయిన్ బో స్కూల్ కళివెలపాలెం,

6) జిల్లా పరిషత్ హై స్కూల్ చిరమన

7) మున్సిపల్ ప్రాథమిక పాఠశాల వైకుంఠ పురం కావలి

8) వి ఆర్ మున్సిపల్ హై స్కూల్ నెల్లూరు,

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్చ విద్యాలయాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అభినందనలు తెలియజేసారు. అలాగే భవిష్యత్తులో మన జిల్లా స్థాయిని ఇంకా మెరుగు పరుచుటకు అందరూ మరింత కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్ రాజా బాలాజీరావు, సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి వెంకట సుబ్బయ్య, సమగ్ర శిక్ష కమ్యూనిటీ మొబలిజింగ్ అధికారి గోగుల రమణయ్య, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *