తమిళ స్టార్ హీరో జోసఫ్ విజయ్ నుంచి విడాలకులు కోరిన భార్య సంగీత
అమరావతి: తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ నుంచి విడాలకులు కావాలంటూ ఆయన భార్య సంగీత, చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు వచ్చే నెల 20న విచారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రముఖ నటితో విజయ్‌కు సంబంధం ఉన్న కారణంగానే సంగీత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలోనే గత రెండేళ్లుగా విజయ్-సంగీత విడిగా ఉంటున్నారు. సంగీత లండన్‌కు చెందిన తమిళ కుటుంబానికి చెందినవారు. విజయ్ నటుడిగా ఎదుగుతున్న సమయంలో ఆయన అభిమానిగా సంగీత పరిచయం అయ్యారు.
1999లో వివాహం చేసుకున్న విజయ్-సంగీత జంటకు కుమారుడు జోసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషా ఉన్నారు. దాదాపు 26 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక బంధం తర్వాత విజయ్ భార్య సంగీత ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు తమిళనాట చర్చనీయాశంగా మారింది. విజయ్ TVK పార్టీ పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన సిద్ధం అవుతున్నాడు. ఈ ఇలాంటి సమయంలో భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకు వెళ్లడం అనేది ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది వేచిచూడాల్సిందే.

