మైనింగ్ శాఖలో డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో రూ.4 కోట్ల నగదును స్వాధీనం
అమరావతి: ఒడిశాలోని మైనింగ్ శాఖలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో కోట్ల రూపాయల అవినితి డబ్బు పట్టుపడింది.ఒడిశా విజిజెన్స్ డిపార్టమెంట్ చేపట్టిన ట్రాప్ ఆపరేషన్ లో బాగంగా కటక్ సర్కిల్‌లోని మైన్స్ శాఖకు చెందిన డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మోహంతి ఇంట్లో తనిఖీలు చేసిన విజిలెన్స్ శాఖ అధికారులకు దిమ్మతిరిగింది.సదరు ఇంటి నుంచి సుమారు రూ.4 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్‌లో అతను నివాసం వుంటున్న ఫ్లాట్ నుంచి బుధవారం ఉదయం ఆ డబ్బును సీజ్ చేశారు. ట్రాలీ బ్యాగులు, అల్మారాల్లో ఆ డబ్బును దాచినట్లు గుర్తించారు. సీజ్ చేసిన డబ్బును అధికారులు ఇంకా లెక్కిస్తున్నారు. నిందితుడు దేబబ్రత మోహంతి ఆఫీసర్ రూమ్‌లో నుంచి రెండు లక్షల నగదు సీజ్ చేశారు.

మంగళవారంమే మోహంతిని ట్రాప్ చేసి అధికారులు పట్టుకున్నారు. ఓ బొగ్గు వ్యాపారి లైసెన్స్ కోసం అతను 30 వేల లంచం తీసుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో సిద్దంగా వున్న విజిలెన్స్ అధికారులు అవినితి తిమింగళంను పట్టుకున్నారు. అతనికి చెందిన పలు ప్రదేశాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. పాటియాలోని శ్రీవిహార్‌లో ఉన్న నేచర్ క్రెస్ట్ అపార్ట్ మెంట్‌తో పాటు భద్రక్ జిల్లాలో ఉన్న మాతసాహి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. భువనేశ్వర్‌లో ఉన్న పహలాలోని రెండు అంతస్తుల బిల్డింగ్ తో పాటు ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

