AGRICULTURENATIONALTECHNOLOGY

114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

అమరావతి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్ (DAC), భారత వైమానిక దళం (IAF) కోసం ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగొలుకు సంబంధించిన (AoN) అంగీకారాన్ని మంజూరు చేసింది. సుమారు రూ. 3.25 లక్షల కోట్ల నుండి రూ. 3.6 లక్షల కోట్ల విలువైన రక్షణ ప్రాజెక్ట్ తో IAF పోరాట సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత నావికా దళం కోసం 6 పీ8i (P8i) విమానాలను కొనుగోలు చేసే డీల్‌‌ను కూడా ఆమోదించినట్టు తెలిపాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఫిబ్రవరి ద్వితీయార్థంలో భారత్ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగానే డిఫెన్స్ డీల్‌పై సంతకాలు జరిగే అవకాశాలున్నాయి. డీల్ ప్రకారం 18 రఫేల్ జట్లను ‘ఫ్లై-అవే కండిషన్’లో నేరుగా తీసుకువస్తారు. మిగిలిన 96 విమానాలు ఇండియాలో అసెంబుల్ చేస్తారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా స్థానికంగా తయారీ, అసెంబెల్ కోసం రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్, భారత్‌లోని ప్రైవేటు రంగ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *