మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 11న జరగనున్న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొననున్నారని జనసేన పార్టీ కార్యలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపిం.జనసేన పార్టీ – భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ, 7- 8 తేదీలలో తెలంగాణలోని పలు ప్రాంతాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఆయన నిర్ణయించుకున్నారని వెల్లడించింది. ఈ ఎన్నికల ప్రచార షెడ్యూల్ రూట్ మ్యాప్ త్వరలో ప్రకటించనున్నట్లు పేర్కొంది.
తెలంగాణ
పవన్ కల్యాణ్ అర్ధరాత్రి:- మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అర్ధరాత్రి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ చీఫ్ రాంచందర్రావు కీలక సమావేశం నిర్వహించారు. పవన్ నివాసంలో మున్సిపల్ ఎన్నికలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తొంది. ఈ సందర్భంగా బీజేపీకి పవన్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నారు.

