AP&TGPOLITICS

చంద్రబాబు-అమరావతి-మదర్ ఆఫ్ అల్ స్కాం-సజ్జల రామకృష్ణారెడ్డి

అమరావతి: చంద్రబాబు-అమరావతి పేరుతో జరుగుతున్న అభివృద్ది పనులు మదర్ ఆఫ్ అల్ స్కాం అంటూ వైయస్ఆర్ సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.శనివారం చంద్రబాబు చెప్పే మాటలను తూచ తప్పకుండా ప్రజల ముందుక వుంచేందుకు ఆర్గనైజ్ డ్ మీడియా టెర్రరిజం..పనిచేస్తొందని ఆరోపించారు.అమరావతి అంటే మదర్ ఆప్ అల్ స్కాం..నువ్వు చేస్తున్నది తప్పు అంటే కట్లకుక్కల విరుచుకు పడుతున్నాడు..

చంద్రబాబు గత ఐదేళ్ల కాలంలో పెట్టింది కేవలం రూ.5 వేల కోట్లే అన్నారు. మొదటి దఫా డెవలప్‌ చేయాలంటే రూ.లక్ష కోట్లు అవుతుంది.. ఇలాగే పోతే.. ప్రాజెక్టు ఎప్పటికి అయ్యేది అనే ప్రశ్న జగన్‌ లేవనెత్తారన్నారు. దీంతోపాటు అమరావతి చుట్టూ పూర్తి స్కాంలు ఉన్నాయన్నారు.

ఇప్పటికే చంద్రబాబు అమరావతి పేరుమీద దాదాపు 40 వేల కోట్లకు పైబడి అప్పులు తెస్తున్నారు.తెచ్చిన అప్పులు కూడా ప్రయార్టీ పనులపై ఖర్చు పెట్టడంలేదని ఆరోపించారు. రైతుల సమస్యలు తీర్చకుండా నానా రకాలుగా ఖర్చు పెడుతున్నారని,, 50 లక్షల చదరపు అడుగుల సచివాలయం అవసరమా?  అంటూ ప్రశ్నించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *