AP&TGCRIME

డ్రగ్స్ వినియోగిస్తూ ఈగల్ టీంకు దొరికిన కడప ఎమ్మేల్యే కొడుకు

హైదరాబాద్: ఎమ్మెల్యే కొడుకు డ్రగ్స్ వినియోగిస్తూ హైదరాబాద్ ఈగల్ టీంకు అడ్డంగా దొరికాడు. గంజాయి తీసుకుంటూ కడప జిల్లా జమ్మలమడుగు MLA ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి ఈగల్ టీంకు పట్టుపడ్డాడు. విశ్వనీయమైన సమాచారం అందడంతో,, నానక్‌రామ్‌గూడలోని అతని ఇంటికి వెళ్లి డ్రగ్స్‌ టెస్ట్ చేయగా,,సుధీర్‌రెడ్డికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. సుధీర్‌రెడ్డితో పాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. గతంలో రెండుసార్లు డ్రగ్స్ కేసులో సుధీర్ రెడ్డి పట్టుబడినట్లు సమాచారం. డ్రగ్స్‌ ఎవరు సప్లయ్‌ చేశారన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సుధీర్ రెడ్డి తండ్రి ఆదినారాయణ రెడ్డి,, ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *