AP&TGCRIME

ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి

మాద్విహిడ్మా@సంతోశ్‌…

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరిజిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం వేకువ జామున మావోయిస్టులు,, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు..6 మంది మరణించిన సంఘటనాస్థలానికి అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్‌,, డీఐజీ గోపీనాథ్‌ జెట్టి చేరుకున్నారు.. ఆంధ్రప్రదేశ్‌,, ఛత్తీస్‌గఢ్‌,, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై భద్రతా బలగాలకు విశ్వనీయమైన  సమాచారం అందడంతో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలిసి కూబింగ్‌ నిర్వహించారు..ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా,,అతని భార్య హేమ,,మరో అగ్రనేత ఆజాద్‌ కూడా మృతిచెందినట్లు సమాచారం.. మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని, వారిలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఉన్నారని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు..2017 సంవత్సరాలో 25 మంది CRPF జవాన్ల  మృతికి  కారణమైయ్యాడు..హిడ్మాపై రూ.కోటికిపైగా రివార్డు ఉండగా, ఆయన భార్య హేమపై రూ.50 లక్షలకు పైగా నగదు బహుమతి ఉన్నది.. అధికారికంగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అసలు పేరు మాద్విహిడ్మా@సంతోశ్‌:- మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్న హిడ్మా,,పలు మార్లు పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నారు..అగ్రనేతలు సోనూ,,ఆశన్న అలాగే వందలాది మంది మావోయిస్టులు లొంగిపోయిన తరువాత హిడ్మా లొంగుబాటు విషయంలో మవోయిస్టల మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్లు సమాచారం.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *