CRIMENATIONAL

ఛత్తీస్‌గఢ్‌ లోని బిలాస్‌పూర్‌ వద్ద రైలు ప్రమాదం-నాలుగురు మృతి

అమరావతి: ఛత్తీస్‌గఢ్‌ లోని బిలాస్‌పూర్‌ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో రైలు ప్రమాదం జరిగింది.. బిలాస్‌పూర్-కట్ని సెక్షన్‌లో కోర్బా ప్యాసింజర్ రైలు లాల్ ఖాదన్ ప్రాంతం సమీపంలో నిలిచి ఉన్న  గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది..కోర్బా పాసింజర్ రైలు గూడ్సు రైలును ఢీకొనడంతో పాసింజర్ రైలు మొదటి బోగీ గూడ్సు రైలుపైకి ఎక్కినట్టు ఘటనా స్థలికి చెందిన వీడియోల్లో తెలుస్తోంది..అధికారులు హుటాహుటిన సహాయక కార్యక్రమాలు చేపట్టారు.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు..సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.. ఈ విషాద ఘటనలో నలుగురు మరణించినట్లు బిలాస్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ రజనీష్ సింగ్ వెల్లడించారు.. ప్యాసింజర్ రైలు సిగ్నల్‌ను దాటి వెళ్లి, ఆగి ఉన్న గూడ్స్ రైలు వెనుక భాగాన్ని ఢీకొట్టడడంతోఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వర్గాలు తెలిపాయి.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *