AP&TGEDU&JOBSOTHERS

నిరుద్యోగ యువతి,యువకులకు 1000 పైగా ఉద్యోగాల ఇంటర్వూలు-కలెక్టర్

తిరుపతి: చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలకోసం ఎధురు చూస్తున్న నిరుద్యోగ యువతి,యువకుల కోసం,శ్రీ సిటీ, మేనకూరు సెజ్, ఈఎంసి క్లస్టర్, తిరుపతి,చెన్నైలోని 21 బహుళ జాతీయ కంపెనీలలో 1000 పైగా ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్, డా.ఎస్.వెంకటేశ్వర్ కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్ఛేంజ్ -సీడప్ ఆధ్వర్యంలో 22-10-2025 తేదీన  (బుధవారం) ఉదయం 8 గంటల నుంచి సూళ్లూరుపేట లోని శ్రీ సత్య సాయి కళ్యాణ మండపంలో జరగబోయే జాబ్ మేళా కోసం శుక్రవారం తిరుపతి జిల్లా కలెక్టర్, డా.ఎస్.వెంకటేశ్వర్, జాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరించారు.

జిల్లాలోని 5వ తరగతి పైన 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లమా లేదా ఏదైనా డిగ్రీలో లేదా పీజీలో ఉత్తీర్ణత అయిన యువతి యువకులు ఈ  మెగాజాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతీ యువకులు క్రింద తెలుపబడిన రిజిస్ట్రేషన్ లింక్ లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవలెను సూచించారు.

రిజిస్ట్రేషన్ లింకు: https://naipunyam.ap.gov.in/user-registration

రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ 20-08-2025. మరియు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా కలదు.

ఇతర వివరములు కొసం సంప్రదించండి: 9121646661, ‪+919985056929, 9988853335.(కాల్ సెంటర్).

గమనిక:- జాబ్ మేళాకు( ఇంటర్వ్యూలకు)  హాజరయ్యా యువతి యువకులు పైన ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింకులో ఆధార్ ఓటిపితో ట్రైనీ (Trainee Registration) రిజిస్ట్రేషన్ చేసుకొని,,మీ ప్రొఫైల్ లాగిన్ అయ్యి అన్ని కంపెనీలకు అప్లై చేసుకుని అడ్మిట్ కార్డుతో ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి వుంటుంది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *