NATIONALPOLITICS

జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్‌ కన్నుమూత

గిరిజనుల హక్కుల కోసం సుదీర్ఘ పోరాటం..

అమరావతి: జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి,,శిబు సోరెన్‌ (81) మరణించారు..శిబు సోరెన్‌ కిడ్నీ సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చేరి, అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు..తండ్రి మరణ వార్తను ప్రస్తుత జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఈ వార్తను ఎక్స్‌ వేదికగా ప్రకటించారు..

బీహార్‌ భూస్వాములు నుంచి:- జార్ఖండ్‌లోని సారవంతమైన గిరిజనుల భూములన్నీ బీహార్‌ మైదానప్రాంతం నుంచి వచ్చిన భూస్వాములు, వడ్డీ వ్యాపారులు ఆక్రమించి దోపిడీకి పాల్పడుతుండటంతో చిన్నతనంలోనే శిబు సొరేన్‌ తిరుగుబాటు చేశారు..18 సంవత్సరాల వయసులో సంతాల్‌ నవయువక్‌ సంఘ్‌ అనే సంస్థను స్థాపించారు..1972లో బెంగాల్‌ కమ్యూనిస్టు నాయకులతో కలసి జార్ఖండ్‌ ముక్తి మోర్చా (JMM) పార్టీని స్థాపించారు.. గిరిజనుల హక్కుల కోసం సుదీర్ఘ పోరాటం చేశారు..ఆయన లక్ష్యం సాధించేవరకు వెనుదిరగలేదు..స్వరాష్ర్టాన్ని సాధించి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.. బీహార్‌ భూస్వాములు, దోపిడీదారులు, వలసవాదుల నుంచి గిరిపుత్రులకు సొంత రాష్ర్టాన్ని, స్వయం పాలనను సాధించిపెట్టిన నాయకుడుగా శిబు సోరెన్‌ చరిత్రలో నిలిచి పోయారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *