AP&TGCRIME

బాపట్ల జిల్లాలోని గ్రానైట్‌ క్వారీలో ఘోర ప్రమాదం-6 మంది మృతి

అమరావతి: బాపట్ల జిల్లాలోని బల్లికురవ సమీపంలోని సత్యక్రిష్ణ గ్రానైట్‌ క్వారీలో ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది..గ్రానైట్‌ క్వారీలో గ్రానైట్ రాళ్లు జారి పడడడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో క్వారీలో 16 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం..

ఒడిశా వాసులుగా గుర్తుంపు:- శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు..తీవ్ర గాయాలు పాలైయిన కార్మికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు..వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.. బండరాళ్ల కింద పడిఉన్న మృతదేహాలను వెలికితీసి అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.. ప్రమాద ఘటనపై బాపట్ల జిల్లా కలెక్టర్‌, ఎస్పీ స్థానిక అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు వేగవంతం చేశారు.. మృతులు ఒడిశా వాసులుగా ప్రాథమికంగా గుర్తించారు..క్వారీ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.. ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకుని,,క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరపాలని ఆదేశించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *