NATIONALPOLITICS

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన బీజెపీ

అమరావతి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ ఆదివారంనాడు 99 మంది అభ్యర్థులతో విడుదల చేసింది.. నాగపూర్ సౌత్ వెస్ట్ విధాన్ సభ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్,, కంప్తీ నియోజకవర్గం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్కులే, ఘట్కోపార్ వెస్ట్ నుంచి రామ్ కదమ్, చిక్లి నుంచి శ్వేత మహలె పాటిల్, భోకర్ నుంచి శ్రీజయ అశోక్ చవాన్, కాంకావ్లి నుంచి నితీష్ రాణే పోటీ చేయనున్నారు.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కుమార్తె అయిన శ్రీజయ చవాన్, కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరారు..మహారాష్ట్రలో అధికారంలో వున్న (బీజేపీ-ఏక్‌నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్‌సీపీ) కూటమికి,, విపక్ష మహా వికాస్ అఘాడి (శివసేన-యూబీటీ, ఎన్‌సీపీ శరద్ పవార్, కాంగ్రెస్) మధ్య తీవ్రమైన అసెంబ్లీ ఎన్నికల పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తూన్నారు.. ఎన్నికల అనంతరం తిరిగి అధికారంలోకి వస్తామని బీజెపీ  కూటమి ధీమా వ్యక్తం చేస్తుండగా, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చినట్టే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు కూడా తమకే అధికారం కట్టబెడతాయని మహా వికాస్ అఘాడి చెబుతోంది.. 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20వ తేదిన ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది.. నవంబర్ 23వ తేదిన ఫలితాలు వెలువడతాయి.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *