AP&TG

ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న అక్వాన్ తీవ్ర తుపాను

రేపు మధ్యాహ్నం గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం..

ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన..

తీరంలో 80 కి.మీ. వేగంతో గాలులు..

అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అక్వాన్ తీవ్ర తుపాను వేగంగా తీర ప్రాంతం వైపు కదులుతోంది. గత ఆరు గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుపాను నరసాపురంకు 390 కిమీ, కళింగపట్నంకు 320కిమీ, గోపాల్‌పూర్ 410 కిమీ,పూరీ 470కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు.

శుక్రవారం తీరం దాటే అవకాశం:- అక్వాన్ తుపాను రేపు మధ్యాహ్నానికి నరసాపురం-పూరీ మధ్య గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ, ఆర్టీజీఎస్ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉత్తరాంధ్రకు వర్ష సూచన:- తుపాను ప్రభావంతో నేడు, రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *