ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు-సీఎం చంద్రబాబు
ప్రతి ఇంటా ఆనందం, ఆరోగ్యం, శుభాలు వెల్లివిరియాలి–డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అమరావతి: రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. నరకాసురుని చెర నుంచి లోకానికి విముక్తి కలిగించి, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటామని పేర్కొన్నారు. ఈ దీపావళి ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నింపాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు చిగురించాలని అభిలషించారు. ప్రతి ఒక్కరూ వెలిగించే దీపం తమ ఇంటికే కాకుండా సమాజానికి కూడా వెలుగునివ్వాలని ఆకాంక్షించారు. సాటి వారి జీవితాల్లో సంతోషాన్ని నింపడం కూడా పండుగలో భాగం కావాలని సూచించారు. మన పండుగలు అందించే సందేశాన్ని అర్థం చేసుకుని, పరస్పర సహకారం, ఐకమత్యంతో అందరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దీపాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు.

