అర్నబ్ తుపాన్ బుధవారం బాపట్ల- విశాఖ మధ్య యానాంకు సమీపంలో తీరం దాటే అవకాశం
125-135 కి.మీ వేగంతో ఈదురుగాలులు..
సముద్రం ముందుకు వచ్చే అవకాశం..
అమరావతి: అర్నబ్ తుపాన్ ప్రభావం గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిమీ వేగంతో కదిలిన అతి తీవ్ర తుపాన్, ప్రస్తుతానికి విశాఖపట్నంకు 170కి.మీ., కాకినాడకు 140 కి.మీ., మచిలీపట్నంకు 230 కి.మీ., బాపట్లకు 300 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.బుధవారం ఉదయానికి బాపట్ల- విశాఖ మధ్య యానాంకు సమీపంలో తీరం దాటే అవకాశం వుందని పేర్కొన్నారు.
125-135 కి.మీ వేగంతో ఈదురుగాలులు:- తీరం దాటే సమయంలో 125-135 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం అత్యంత కీలక సమయం ప్రజలు బయటకు రావొద్దు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కాసేపట్లో పోలవరం, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు
సముద్రం ముందుకు వచ్చే అవకాశం:- పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్ ప్రభావం ఎగసి పడే అలలతో సముద్రం కాకినాడ జిల్లా పొలెకుర్రులో 300 మీ ముందుకు వచ్చే అవకాశం వుందన్నారు. పొన్నాడలో 200మీ, పేరుపాలెంలో 190మీ, జి.వేమవరంలో 180మీ ముందుకు వచ్చే అవకాశం వున్నాయని వెల్లడించారు. తీర ప్రాంత మత్స్యకారులు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

