NATIONAL

చిన్మయ మిషన్,భారతదేశపు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచంతో పంచుకుంటోంది-ప్రధాని మోదీ

వలసవాద మనస్తత్వం నుండి విముక్తి..

“మన సంస్కృతిక వారసత్వం పట్ల గర్వం”..

స్వామి చిన్మయానందతో తన చివరి సమావేశం..
అమరావతి: చిన్మయ మిషన్ దశాబ్దాలుగా సమాజాలకు సేవ చేస్తూ, భారతదేశపు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచంతో పంచుకుంటోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.శుక్రవారం ఢిల్లీలోని భారత్ మండపంలో ‘చిన్మయ అమృత మహోత్సవ గ్లోబల్ సమ్మేళన్’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. చిన్మయ మిషన్ 75 ఏళ్ల ఉత్సవాల ముగింపు కార్యక్రమం నేటి నుంచి అక్టోబర్ 25 వరకు జరగనుంది.ఈ సందర్బంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ

వలసవాద మనస్తత్వం నుండి విముక్తి:- స్వామీజీ భారతీయ తత్వాన్ని ప్రపంచానికి తీసుకువెళ్లడానికీ, నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచాన్ని భారతదేశంతో ఏకం చేయడానికీ మార్గం చూపిందన్నారు. దేశ ప్రజలకు “మన వారసత్వం పట్ల గర్వం, బానిసత్వ మానసికత నుండి విముక్తి పొందామనే భరోసా—ఇవే ఈ దేశం ఇప్పుడు సరైన మార్గంలో ముందుకు సాగుతోందనడానికి నిదర్శనం” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మన దేశ ప్రాచీన ఋషులు,దేశభక్తులు ఊహించిన మార్గంలోనే దేశం పురోగమిస్తోందని నిరూపిస్తున్నాయని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ఈ ప్రయాణంలో వారి మేధో వారసత్వమే దేశానికి అతిపెద్ద బలంగా నిలుస్తుందని ఆయన ఉద్ఘాటించారు.

స్వామి చిన్మయానందతో తన చివరి సమావేశం:- యువశక్తిని సద్వినియోగం చేసుకోవడం ద్వారానే బలమైన భారత్‌ను నిర్మించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 1993లో ఆధ్యాత్మిక గురువు స్వామి చిన్మయానందతో జరిగిన తన చివరి సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ భేటీలో దేశాభివృద్ధిలో యువత పాత్ర, యువశక్తిని పెంపొందించడంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *