AP&TGPOLITICS

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లో ప్రారంభించండి-హైకోర్టు

హైకోర్టు తీర్పుపై సుప్రీంలో సవాల్ చేయనున్న ప్రభుత్వం…

వార్డుల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో జోక్యానికి..

అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై గురువారం హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లో ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అయితే, బీసీలకు 34శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు డిస్మిస్ చేసింది. 105,1065 జీఓలు రెండింటిని కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా జీఓలు ఇచ్చారని న్యాయస్థానం పేర్కొంది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని పేర్కొంది. అయితే, బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు తీరుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

వార్డుల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో జోక్యానికి:- బీసీల జనాభా గణన చేపట్టి, రిజర్వేషన్లు ఖరారు చేశాకే ఎన్నికలు నిర్వహించాలంటూ వైసీపీ దాఖలు చేసిన పిటీషన్ పై జోక్యానికి హైకోర్టు ద్విసభ్య బెంచ్ నిరాకరించింది. సర్పంచ్ ఎన్నికల్లో బీసీలను ఉపవర్గీకరించి రిజర్వేషన్లు నిర్ణయించాలంటూ వేసిన పిల్​ను హైకోర్టు కొట్టివేసింది. వార్డుల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో జోక్యానికి న్యాయస్థానం నిరాకరించింది. గ్రామపంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలు చేసిన పిల్​లో పలు ఆదేశాలు జారీ చేసింది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *