AP&TG

బంగాళాఖాతంలో మరో వాయుగుండం-వాతావరణశాఖ

అమరావతి: ఉత్తర అండమాన్ సముద్రం-దానిని ఆనుకుని ఉన్న మయన్మార్ తీరంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తర అండమాన్ సముద్రం-దానిని ఆనుకుని ఉన్న మయన్మార్ తీరంలో ఏర్పడిన అల్పపీడనం గత 3 గంటల్లో, గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలి, తీవ్ర అల్పపీడనంగా బలపడి, సోమవారం (సెప్టెంబర్ 28) ఉదయం 11:30 గంటలకు అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది.

ఉత్తర-వాయువ్య దిశగా తన కదులుతూ సోమవారం సాయంత్రం వేళ యాంగూన్ మరియు క్యైక్టో (మయన్మార్) మధ్య మయన్మార్ తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది. ఆటు తర్వాత, రాబోయే రెండు రోజుల్లో ఇది మయన్మార్ తీరం వెంబడి, అలాగే దానికి ఆనుకుని ఉన్న తూర్పు-మధ్య-ఈశాన్య బంగాళాఖాతం-ఆగ్నేయ బంగ్లాదేశ్ మీదుగా ఉత్తర-వాయువ్య దిశగా మరింత ముందుకు సాగే అవకాశం ఉందని వెల్లడించింది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *