AP&TGPOLITICS

శాప్‌ ఆఫీస్‌ వద్ద దాడిపై అన్ని ఆధారాలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం- మాజీ సీ.ఎం, వైయస్‌ జగన్‌

డీఎస్సీ–2025 స్కామ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని కోరాం..

అమరావతి: శాప్‌ కార్యాలయం వద్ద వైయస్సార్‌సీపీ నాయకులపై జరిగిన దాడికి సంబంధించి ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.అలాగే డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.గవర్నర్‌తో భేటీ అనంతరం లోక్‌భవన్‌ వద్ద వైయస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు.

డీఎస్సీ స్కామ్‌లో:- సెప్టెంబరు 21న జరిగిన ఘటనపైనే కాకుండా, ఏ విధంగా డీఎస్సీ స్కామ్‌లో యువత నష్టపోయింది అనేది వివరించాము. ఈ వ్యవస్థలో ఒక మార్పు రావాలన్నా, ఈ వ్యవస్థ మీద ప్రజలకు మళ్లీ నమ్మకం రావాలన్నా, ఈ వ్యవస్థలో లోపాలు సవరించాలన్నా డీఎస్సీ స్కామ్‌పై కచ్చితంగా సీబీఐ విచారణ జరగాలి. విద్యా శాఖ మంత్రి రాజీనామా కూడా చేయాలి.

1). మొట్టమొదట రెండు ఫంక్షన్లు ఒకే వ్యక్తి చేతికి అప్పగించడం. ప్రశ్నపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ రెండూ ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌కు అప్పగించారు. దీంతో స్కామ్‌ ప్రారంభం అయింది.

2). రెండోది మొత్తం ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల చేతిలో పెట్టారు. అలా పని చేస్తున్న నవీన్‌ అనే వ్యక్తికి కృష్ణా జిల్లాలో ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చినా, అతడికి ఉద్యోగం ఇవ్వలేదు. తన పేరు తొలి మెరిట్‌ లిస్ట్‌లో చూపి, ఆ తర్వాత లిస్ట్‌లో పేరు తొలగించారు.

3). స్పోర్ట్స్‌ కోటా పేరుతో అడ్డగోలుగా జీఓలు ఇచ్చారు. గతంలో ఉన్న జీఓలు రద్దు చేసి కొత్తగా.. జీఓ నెం: 4, 47 అని చెప్పి, రెండు కొత్త జీఓలు తెచ్చి, వాటి ద్వారా పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా ఉద్యోగాలు ఇచ్చారు. ఆ తర్వాత 372 ఉద్యోగాలు ఆ జీఓల పేరుతో ఇచ్చారు. ఆ రిక్రూట్‌మెంట్‌ పూర్తి కాగానే మళ్లీ మూడు జీఓలు తెచ్చారు. జీఓ నెం: 23, 25, 56 తెచ్చారు. దాని ప్రకారం మళ్లీ పరీక్ష ఉండాలని నిబంధన పెట్టారు. మరి ఇక్కడ 372 మందికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారన్న దానికి సమాధానం లేదు.

4). ఫేక్‌ సర్టిఫికెట్లు. ఏరకంగా నారా లోకేష్‌ తోడల్లుడు, విశాఖ ఎంపీ  భరత్‌ దొంగ సర్టిఫికెట్లు ఇచ్చాడో చూశాం. జరగని గేమ్స్‌ జరిగినట్లు చూపారు. అలాగే ఏపీ సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ అయిన ఎమ్మెల్యే కూన రవికుమార్‌.. దాదాపు 38 ఉద్యోగాలకు సంబంధించి, సర్టిఫికెట్లు ఇచ్చారనేది కూడా చెప్పాం. ఇంకాసాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్లకు సంబంధించి కొన్ని జిల్లాలో సెక్రటరీలకు, వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చారు అనేవి కూడా చెప్పాం అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *