ఉత్తర బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం
రేపు, ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం..
అమరావతి: ఉత్తర బంగాళాఖాతం,పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్తరకోస్తా తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ., గరిష్టంగా 60 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండి అలలు ఎగసి పడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.

