రోడ్డు ప్రమాదంలో యాక్ట్ రిపోర్టర్ రమేష్ మృతి
నెల్లూరు: మనుబోలు మండలం కొమ్మలపూడి క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఆటో బోల్తా పడడంతో మనుబోలు యాక్ట్ రిపోర్టర్ రమేష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. రమేష్ ఆటోలో సిమెంటు, కమ్మెను ఇంటికి తీసుకువెళ్తుండగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటో నడుపుతున్న రమేష్ కు తీవ్రగాయాలు కావడంతో,రమేష్ ను హైవే అంబులెన్సు లో చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రమేష్ మృతి చెందాడు. ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న హైవే మొబైల్ హెడ్ కానిస్టేబుల్ మస్తాన్ మహేష్ లు సంఘటన స్థలంకు చేరుకుని హైవేపై ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.వెంకటాచలం సి.ఐ సురేంద్ర బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

