CRIMENATIONAL

దేశంలో గూఢచర్యం చేస్తున్న భార్య,భర్తలను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు

అమరావతి: పాకిస్తాన్ దేశంకు ఒక రకంగా ప్లీపర్ సెల్స్ గా వుంటూ, గూఢచర్యం చేస్తున్న భార్య,భర్తలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పోలీసులు పలు కీలక వివరాలు రాబట్టారు.పోలీసులు అరెస్ట్ చేసిన జంటను మొహమ్మద్ సాహిల్, అతడి భార్య సమీరగా గుర్తించారు. వీరి అరెస్టుకు సంబంధించిన వివరాల్ని పోలీసులు శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. సాహిల్, సమీర జంట ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్‌ ప్రాంతంలో ఉంటున్నారు.

సాహిల్ ఉత్తర ప్రదేశ్‌లోని బదాయున్ ప్రాంతానికి చెందినవాడు కాగా త్వరలో ఎల్‌ఎల్‌బీ చదివేందుకు ప్లాన్ చేసుకున్నాడు.2005లో బిజ్నూర్‌కు చెందిన సమీర ఇంటర్ పూర్తి చేసింది. వీరిద్దరూ కొంతకాలంగా పాకిస్తాన్‌కు చెందిన నిఘా సంస్థ (ISI-ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) సంస్థతో కలిసి పని చేస్తున్నారు. ఇంటెల్ జెన్స్ బ్యూరో అందించిన సమాచారం ఆధారంగా నార్తర్న్ రేంజ్ ఆఫ్ ద స్పెషల్ సెల్ పోలీసులు ఈ జంటను అదుపులోకి తీసుకున్నారు. సాహిల్ 2024 నుంచి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పాకిస్తాన్ అధికారులను సంప్రదిస్తూ, వారి కోసం పనిచేస్తున్నాడు.

అతడితోపాటు భార్య సమీర కూడా పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తుంటుంది. ఈ ఇద్దరికీ తగిన ఆర్థిక సాయం అందిస్తామని పాక్ ఏజెంట్లు హామీ ఇవ్వడంతో ఇద్దరూ గూఢచర్యం చేస్తున్నారు. పాక్ వారికి అనుకూలంగా ఉండేవారిని ఇంకా సభ్యులుగా చేర్పించడం, అలాగే వారికి రవాణ సదుపాయం చేయడం వంటి పనుల్ని పాక్ ఐఎస్‌ఐ అప్పగించింది. ఈ జంట ఇక్కడ ఎనిమిది సిమ్ కార్డులు కొని, దుబాయ్ ద్వారా పాకిస్తాన్ పంపింది. ఈ సిమ్ కార్డులకుగాను వారికి రూ.30,000 అందాయి. ఈ ఇండియా నెంబర్లను పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు.

వీటికి సంబంధించిన వాట్సాప్ కూడా పాకిస్తాన్ యాక్టివేట్ చేసింది. ఈ నెంబర్ల ద్వారా నిఘా వివరాలను తెలుసుకుంటున్నారు. ఇండియన్ నెంబర్లతో పాకిస్తాన్ ఏజెంట్లు అనేక ఇండియన్ వాట్సాప్ గ్రూపుల్లోకి సభ్యులుగా చేరారు. దేశంలోని వివిధ మిలటరీ కంటోన్మెంట్ ప్రాంతాల్లో ఈ జంట పర్యటించి, అక్కడి సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేసింది. ఈ దంపతులకు సంబంధించిన ఫోన్లను సీజ్ చేసిన పోలీసులు, వీరికి సంబంధించిన ఇతర వివరాలపై విచారణ కొనసాగుతోంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *